Posted on 2025-09-26 17:43:01
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సమాజసేవకుడు కాటేగర్ శంకరరావు కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా పురస్కారం లభించనుంది. ఈ పురస్కారం అఖిలభారత పద్మశాలి సంక్షేమ సంఘం స్థాపించబడింది. ఈనెల సెప్టెంబర్ 27న తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కేంద్ర గ్రంథాలయ అధ్యక్షులు డా.రియాజ్ అలీ, పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్ ల చేతుల మీదుగా ప్రదానం కానుంది. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం నిర్వహించబడును.
శంకరరావు 40 ఏళ్లకు పైగా సమాజసేవలో అహర్నిశలు కృషి చేశారు. సహస్త్ర అర్జున క్షేత్రీయ (ఎస్‌ఎస్‌కే) కార్యదర్శిగా పనిచేస్తూ, వేలాది ఉచిత వివాహాలు నిర్వహించారు. మహిళా కళాశాలలు, హైస్కూలులు స్థాపించి వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించారు. ఆర్థిక సహకార మండలి ద్వారా వెనుకబడిన కుటుంబాలకు రుణాలు అందించి, వారిని ఆర్థికంగా అభివృద్ధి దిశగా నడిపించారు.
తెలంగాణ ఉద్యమం రెండు దశల్లోనూ చురుకుగా పాల్గొన్న ఆయన సేవలను గుర్తించి ఈ గౌరవం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ, “శంకరరావు సేవలు సమాజానికి గర్వకారణం అని భవిష్యత్తులో మరిన్ని గౌరవాలు లభించాలని ఆశిస్తున్నామని తెలిపారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >