డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీ లో నిన్న వచ్చిన వరద కాలువ నీరు ఇండ్ల చుట్టూ చేరి ముంపునకు గురయ్యాయి ఆ నీటితో పాటు విషపూరిత పాములు వస్తున్నాయి. ఇప్పుడు కొండచిలువలు ఇండ్ల మద్యలోకి వచ్చి తిరుగుతున్నాయి. అధికారులు, నాయకులు ఇప్పుడైనా స్పందించి ఎవరికి ఏ అపాయం కలగకముందే నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకొగలరు అని కాలనీవాసులు కోరుతున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తచెరువు నుండి నీటిని వదలడం వల్లే కొండచిలువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొత్తచెరువు నుండి నీరు అధికంగా కాలనీలోకి వస్తుందని దాని వలన ఇంకా ఎన్ని విపత్తులు వస్తాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నవీన్ కోరారు. రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.