| Daily భారత్
Logo




ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నూతన జిఎస్టి విధానం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు

News

Posted on 2025-09-23 13:46:53

Share: Share


ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నూతన జిఎస్టి విధానం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు

దేశ ప్రజలకు నవరాత్రుల కానుక..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిఎస్టీ ద్వారా ప్రధాని మోదీ భారతీయులకు నవరాత్రి కానుకలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ జీఎస్టీ ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు కొత్త జి ఎస్టీ విధానం మేలు జరుగుతుందన్నారు.

ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోజువారీ సామగ్రి పై 18 శాతం నుండి 5 శాతానికి జిఎస్టీ తగ్గించారని, ద్విచక్ర వాహనాలపై 28 శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ తగ్గిందన్నారు. అదేవిధంగా లైఫ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం లు గణనీయంగా తగ్గుముఖం పడే అవకాశం ఉందన్నారు. కొత్త జీఎస్టీ రీఫామ్ ద్వారా దేశ జీడీపీ 1 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం లో టాక్స్ ట్రాన్స్పెరెన్స్ విధానం అమలు అవుతుందన్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ ద్వారా 7 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇస్తున్నామని మేము సంతోషిస్తున్నమ్మన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో ఆదాయం తగ్గిందని ఏడుస్తున్నారని ఏద్దెవా చేశారు. ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మద్యన వ్యత్యాసం అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >