Posted on 2025-09-22 12:01:13
భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు మూడింతలు నష్టపరిహారం ఇవ్వాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్
సంగారెడ్డి, డైలీ భారత్ న్యూస్:మునిదేవునిపల్లి లో రైతుల ఆందోళన..
పరిశ్రమల కోసం భూములు తీసుకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, మార్కెట్ రేట్ కు మూడింతలు పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు.
ఈరోజు కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలో ఐలమ్మ విగ్రహం వద్ద రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 92 లో గల సుమారు భూమి 293 ఎకరాల భూమిని 277 మంది రైతులు గత దశాబ్దాల కాలంగా సాగు చేసుకుని జీవనం గడుపుతున్నారని అన్నారు. ఆ భూములను కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అని ప్రచారం చేస్తూ టిజీఐఐసీ పేరుతో రైతుల నుండి భూములను గుంజుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గర ఉండడం జాతీయ రహదారులకు దగ్గర ఉండడంతో కోట్ల రూపాయలలో భూమి విలువ పలుకుతుందని అన్నారు. కానీ రైతులకు ఎంతో కొంత ఇచ్చి భూములు గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. రైతుల భూమిని బడా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, భూములు తీసుకోవాల్సి వస్తే 2013 చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో వెంటనే గ్రామసభ పెట్టి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని బలవంతంగా భూ సేకరణ చేయొద్దని అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, రైతుల ఒప్పందంతో భూములు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు భూములు తీసుకుంటే ఊరుకునేది లేదన్నారు. గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో రైతుల పేర్లు అవకతవకలు ఉన్నాయి.కబ్జాలల్లో ఉండి కాస్తులల్లో వారికి కూడా ఇష్టపరిహారం అందేలా చూడాలని,గతంలో పట్టా పాస్ పుస్తకాలు సర్టిఫికెట్లు ఉన్న భూప్రక్షాళన వచ్చిన తర్వాత కొన్ని పేర్లు రికార్డులలో లేవు కనుక వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగాన్యాయం చేకూరాలని 2013 చట్ట ప్రకారము నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నిర్మిస్తే అందులో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే.రాజయ్య,పార్టీ సభ్యుల అర్జున్, శ్రీనివాస్, మానయ్య, రాంచందర్, శీను,రైతులు కమల్ రెడ్డి,నర్సింలు,లక్ష్మారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు..
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >