Posted on 2025-09-21 14:34:49
బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత లేని లోటు స్పష్టంగా కనిపించిన వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాసవీ కన్యకా పరమేశ్వరీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో మహిళలు బతుకమ్మ వేడుకుల నిర్వహించారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఆడపడుచులు ఈ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుకునే వేడుకలకు గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేని లోటు ఆమె అభిమాన, అనుచరుల వర్గాల్లో నిరాశనే మిగిలింది. ఇటీవల పార్టీలో నెలకొన్న విభేదాలు, పార్టీ నుండి సస్పెండ్ అయిన కవిత తన స్వగ్రామంలోనే బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఆడపడుచులందరూ బతుకమ్మ సంబరాలను ఎంతో ఆర్భాటంగా ఘనంగా నిర్వహించేవారు. నిజానికి కవిత అత్తగారు నిజామాబాద్ కు చెందిన వాసులే అయినప్పటికీ ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి బతుకమ్మ సంబరాలు బోసిపోయినట్లుగా ప్రారంభించడం జరిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >