| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజావాణి రద్దు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రజావాణి రద్దు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించనుండటంతో, జిల్లా అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ కారణంగా రేపు (22-09-2025) జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి రేపు జిల్లా కార్యాలయానికి ప్రజావాణి కోసం దరఖాస్తులు ఇవ్వడానికి రాకూడదని కలెక్టర్ సూచించారు.

Previous గంజాయి విక్రయిస్తున్న ఇద్ద‌రు వ్యక్తులుఅరెస్ట్
Next నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
ADVERTISEMENT