| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచార మేరకు...

సంగారెడ్డి పట్టణ శివారులోని ఫసల్ వాడి గ్రామంలో బ్రహ్మానంద గౌడ్, చిరుగూరి డేవిడ్ మరియు కొండాపురం శివ అనే వ్యక్తులు కొన్ని రసాయన పదార్థాలను మిశ్రమంగా డ్రగ్స్ రూపంలో తయారు చేసి మధ్యతరగతి వారికి అలాగే కూలీ పని చేసుకునే వాళ్ళకి అమ్ముతున్నారని సంగారెడ్డి జిల్లా పోలీసులకు సమాచారం అందగా...

సమాచారం అందుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేయగా నిందితుల నుంచి నిషేధిత రసాయన  అల్ఫ్రాజోలం మరియు అలాగే మరికొన్ని రసాయనాలను తీసుకోవడం జరిగింది.

ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అనేకమంది యువతి యువకులు డ్రగ్స్ మరియు గంజాయికి అలవాటు పడి నేరాలు చేయడం జరుగుతుందని మాట్లాడారు.

ఎవరైనా సరే డ్రగ్స్ మరియు గంజాయి తయారుచేసిన అమ్మిన అటువంటి వారిపై ఉక్కు పాదం మోపి కటకటాల వెనక్కు పంపిస్తామని మాట్లాడారు.

ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా లో ఎవరైనా డ్రక్స్ కానీ గంజాయి కానీ వాడినట్లు అయితే సంగారెడ్డి జిల్లా పోలీసులకు తెలపండి.

అలాగే ఇటువంటి నిషేధిత ట్రక్స్ కానీ గంజాయి కానీ తయారు చేస్తున్న మరియు వినియోగిస్తున్న వారి వివరాలు  తెలిపిన వివరాలను గోప్యంగా ఉంచుతాము అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ కోరారు.

అలాగే ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ మార్చుతానని మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ రమేష్ కుమార్ మరియు సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ మరియు స్పెషల్ బ్రాంచ్ సీ.ఐ శివలింగం పాల్గొన్నారు.

Previous అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌ వాసుల మృతి..!
Next కోళ్ల వ్యాన్‌కు ప్రమాదం.. కోళ్లను ఎత్తుకుపోయిన జనం
ADVERTISEMENT