| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాంఘిక గురుకుల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య?

సాంఘిక గురుకుల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య?

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లో జరిగింది.

స్థానికుల కథనం మేరకు.. నగునూర్ లో  తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సృజన అనే విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం ఆర్డరాత్రి హాస్టల్లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది .

ఈరోజు ఉదయం హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి స్వస్థలం మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామం. సృజన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

సృజన ఆత్మహత్యకుగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Previous ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏ పనినైనా సహించేది లేదు: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
Next రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్‌
ADVERTISEMENT