| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి ప్రారంభమైంది. డిసెంబర్ 27వ తేదీన సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణ కోసం రంగం సిద్ధమైంది.

ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలు, అనేక తర్జనభర్జనల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 

మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 13 కార్మిక సంఘాలు, ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నాయి.

కార్మికులను ప్రసన్నం చేసుకోవడం కోసం వ్యూహరచనల్లో నిమగ్నమయ్యాయి.

Previous రామానుజన్ నెంబర్ 1729 ప్రదర్శన
Next ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏ పనినైనా సహించేది లేదు: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
ADVERTISEMENT