| Daily భారత్
Logo




వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

News

Posted on 2023-12-19 13:54:02

Share: Share


వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్ పీఎస్లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రసాద్ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్ జైలులో ఉన్నాడని ఆయన్ని కలుద్దామని చెప్పిఈ నెల 1న ఆయనభార్యశాన్వికనుప్రశాంత్, నిజామాబాద్ తీసుకెళ్లాడు.బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్ వద్దకు వెళ్లామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్ 4న తమ్ముడితో కలిసి పిల్లల్ని ప్రశాంత్ చంపేసి మెండోర వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది” అని సింధు శర్మవివరించారు. ఆమె కోసం వచ్చినముగ్గురిని అరెస్టు చేసినట్లుచెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద  ప్రశాంత్ మరో ఇద్దరునిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్ వద్దలభించాయని ఇప్పటి వరకు 4మృతదేహాలు లభించగా, ప్రసాద్ ఆయన భార్య మృతదేహాలు లభ్యంకాలేదని ఎస్పీ తెలిపారు

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >