డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటర్ నమోదు పై ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలి.
అసిస్టెంట్ ఎలక్టో రల్ ఆఫీసర్, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్ పిలుపు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, వంద శాతం ఓటర్ నమోదు లక్ష్యంగా, పారదర్శకతో కూడిన జాబితా రూపొందించడం కోసం స్పెషల్ సమ్మర్ రివిజన్ చేపట్టినట్లు అయన ఓ ప్రకటనలో తెలియజేశారు.
దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం స్థానిక పంచాయతీ రాజు గెస్ట్ హౌస్ సిరిసిల్ల లో నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ఆదేశం మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం లో హౌస్ టూ హౌస్ సర్వేద్వారా నూతన నమోదు, చేర్పులు, మార్పులు, డిజిటలైసషన్, ఆప్ వినియోగం, చేపడుతున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్బంగా జిల్లా మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్ రెడ్డి బి ఎల్ ఓ ల పాత్ర, విధులు, బాధ్యతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అవురం సుధాకర్ రెడ్డి, బంటు బాలకిషన్, సూపర్ వైజర్స్ డిప్యూటీ తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.