| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు,నియోజకవర్గ ప్రజలు

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు,నియోజకవర్గ ప్రజలు

జిల్లా సరిహద్దు నుంచి వేములవాడ వరకు అంబరాన్ని అంటేలా స్వాగత ఏర్పాట్లు

జిల్లెల నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీలు, గజ మాలలతో ఘన సత్కారాలతో స్వాగతాలు

ర్యాలీ అనంతరం వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వస్తున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల క్రాసింగ్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మండల నాయకులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చం అందించి ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నటువంటి ప్రాంత ఎమ్మెల్యే కు ప్రభుత్వ విప్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, దీనికి ప్రత్యేక కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని వారు ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ విప్ గా తోడ్పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు గజమాలతో సత్కరించారు. అనంతరం నేరుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు..

Previous డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి : కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి
Next పొన్నం ప్రభాకర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ADVERTISEMENT