| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ జారి చేయడం పట్ల హర్షం

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు  ప్రభుత్వ విప్ జారి చేయడం పట్ల హర్షం

డైలీ భారత్, సిరిసిల్ల టౌన్: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ గా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు  హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ గా నియమించడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం జిల్లాకు వస్తున్న ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం ఉంటుందని, మానేరు బ్రిడ్జి నుండి స్వాగత ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఇట్టి స్వాగత ర్యాలీలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు  నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, సూర దేవరాజ్, ఆకునూరి బాలరాజు, సామల దేవదాస్, తదితరులు ఉన్నారు.

Previous ప్రభుత్వం జర్నలిస్టులకు జీవనభృతుని కల్పించాలి : ఇండ్ల మహేష్
Next అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి : డిఎస్పి నాగేంద్ర చారి
ADVERTISEMENT