| Daily భారత్
Logo




25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్‌ను గన్‌తో కాల్చి చంపిన తండ్రి

News

Posted on 2025-07-10 18:44:24

Share: Share


25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్‌ను గన్‌తో కాల్చి చంపిన తండ్రి

డైలీ భారత్, హర్యానా:గురుగ్రామ్‌లోని సెక్టార్ 57 లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపారు. సంఘటన సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 57లోని ఓ ఇంట్లో రాధిక తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఏవో కారణాలతో కుటుంబంలో వివాదం చెలరేగింది. దీంతో రాధిక తండ్రి ఆగ్రహానికి గురై క్షణికావేశంతో తన కూతురుపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

కాల్పుల్లో గాయపడిన 25 ఏళ్ల రాధిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్ లో మెడల్స్ సాధించి కుటుంబానికి ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే గురుగ్రామ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన తండ్రిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >