| Daily భారత్
Logo




కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం

News

Posted on 2025-07-09 14:42:16

Share: Share


కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం

బైక్ పై వస్తుండగా కుక్క రావడంతో తప్పించబోతుండగా దారుణం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దైవదర్శనం కోసం బాసర అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా నగరంలోని కంటేశ్వర హౌసింగ్ బోర్డ్ వద్ద కుక్కను తప్పించబోయి బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్‌ ఇంటలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో వీరి ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు వచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెనకాల కూర్చున్న భవాని కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా నిర్ధారించారు. అయితే వారం రోజుల్లో కుమారుడు విదేశాలకు వెళుతున్నాడని సంతోషంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఇంటలిజెన్స్ ఏఎస్ఐ భీమారావు కన్నీరు మునీరుగా విలపించారు. అయితే వీరు స్థానికంగా గంగా స్థాన్ 1 లోని విష్ణు ప్రియ రెసిడెన్సి లో నివాసం ఉంటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇంట్లోకి అడుగుపెట్టే క్రమంలో కుక్క రూపంలో భవాని అనంతలోకాలకు వెళ్ళిపోయింది.  భవాని అపార్ట్మెంట్లో ఎవరికి ఎలాంటి ఆపద ఎదురైనా ముందుండి వారికి ధైర్యం చెబుతూ అండగా నిలిచేవారని ఇప్పుడు ఆమె ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఏఎస్ఐ ఐ సతీమణి మృతి చెందిన విషయం తెలియడంతో ఏఎస్ఐ తోటి సిబ్బంది తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి పద్దకు చేరుకున్నారు. కాగా ప్రమాద ఘటన పై పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >