Posted on 2025-07-09 14:37:31
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నిర్మాణ పనులు, ఆయా విభాగాల కేటాయింపు పై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం
డైలీ భారత్, వరంగల్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపునకు సంబంధించిన వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్య అధికారులను ఆదేశించారు.
బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని సమావేశపు హాలులో వైద్యాధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమావేశమై నిర్మాణ పనులను, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ రేడియాలజీ పాథాలజీ ఫోరెన్సిక్, ఆనిష్టేషియా బయో కెమిస్ట్రీ ఫారెన్సీక్ మెడిసిన్, తదితర క్లినికల్ విభాగాలకు భవనాలలో కేటాయించిన అంతస్తుల వారిగా గదులు, ఇంకను ఇతర విభాగాల ఏర్పాటు కొరకు కావలసిన గదులు, సంబంధిత క్లినికల్ విభాగాల కు అవసరమగు మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రాథమికంగా కేటాయించిన ఆసుపత్రిలోని వివిధ అంతస్తులలో వివిధ విభాగాల వైద్యాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అంతస్తుల వారిగా ఆయా క్లినికల్ విభాగాలకు కేటాయించిన గదులను పరిశీలించి సమర్ధ వంతంగా నిర్వహించుటకు కావలసిన సదుపాయాల గురించి సూక్ష్మ ప్రణాళిక నివేదికను సమర్పిచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ...
వివిధ క్లినికల్ విభాగాల కేటాయింపునకు కావలసిన అంశాలను తెలియజేస్తూ సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాలని ఆయా శాఖాధిపతులకు సూచించారు. త్వరగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనికితోడుగా అవసరమగు కొత్త పరికరాలు సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏ అంతస్తులో ఏయే విభాగాల్లో వసతులు ఉండాలో ఆ సూక్ష్మ ప్రణాళికలో ఉండాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నివేదించే సూక్ష్మ ప్రణాళిక గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంజిఎం సుపరింటెండెంట్ కిశోర్, ఎల్ అండ్ టి అధికారి శరవరన్, జిల్లా ఆర్ అండ్ బి. అధికారి రాజేందర్, టీఎస్ ఎంఐడిసి డీఈ, ఆర్ఎంవోలు, వివిధ విభాగాల వైద్య శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >