Posted on 2025-07-09 08:24:47
డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:
ఆరు అడుగుల పూరిగుడిసెలో...!
టప్ఫ్..టఫ్ప్..టఫ్ప్ పడుతు వస్తున్నా వస్తున్నా
అని చెపుతుంది వాన చినుకు.. కానీ
ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల
పూరిగుడిసెలో...!
వర్షం రాకతో పిల్లలను నా రెక్కల మాటున ముడుచుకొని కూర్చోండి నిద్ర పోతుంటే...
ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల
పూరిగుడిసెలో...!
గంజి నీళ్ల ముంత కూడా వర్షపు నీటిలో పడవలా
తెలియాడుతుంటే...
ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల
పూరిగుడిసెలో...!
ఉరుముల శబ్దాలతో పిల్లల ఆకలి కేకలు శృతి
కలుపుతుంటే...
ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల
పూరిగుడిసెలో...!
మృత్యువుతో పోరాడుతున్న పెనిమిటి వర్షము చినుకులో తడిసి ముద్దయి గజగజ వణుకుతూ
ఉంటే...
ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల
పూరిగుడిసెలో...!
అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు అవలంభిస్తున్న
ఇళ్ల పథకం అమలు చేస్తున్నందులకు అభినందనలు తెలుపుతూ..
ప్రభుత్వం ఇళ్ల పకథం ద్వారా అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలని కోరుకుంటూ...
మీ..
మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >