Posted on 2025-07-08 17:34:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్, ఆధ్వర్యంలో ఈరోజు అశ్వరావుపేట ప్రభుత్వాసుపత్రి ని సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ డి జాకీర్, మాట్లాడుతూ వేగంగా ప్రబలుతున్న సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ఆమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తూ గ్రామస్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలని, పూర్తిస్థాయి మెడిసిన్ ను అందుబాటులో ఉండాలని అన్నారు. అదేవిధంగా అశ్వరావుపేట ప్రభుత్వాసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్న ఓపి పేషంట్లను చూడటానికి అదనంగా డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, రోగులకు అందించే ఆహారాన్ని కూడా అఖిల భారత యువజన సమైక్య నాయకత్వం తిని చూసిందని పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు వారి ఈ విషయాన్ని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం, సిపిఐ జిల్లా నాయకులు గన్నిన రామకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి నూకవరపు విజయకాంత్,ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి ముళ్ళగిరి సాయి,మండల కార్యదర్శి కలపాల రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు తానికొండ బ్రహ్మయ్య, మహమ్మద్ మున్నా,వెంకట్, షేక్ జాన్ పాషా,రాజు, దూలం పోచయ్య , పి చెన్నారావు చెంగల సత్యం తదితరులు పాల్గొన్నారు
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >