| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దాడి చేస్తాం అని హెచ్చరించిన భద్రత కరువు

దాడి చేస్తాం అని హెచ్చరించిన భద్రత కరువు

పార్లమెంట్ పై దాడి చేస్తాం అని హెచ్చరించిన భద్రత కరువు

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : లోక్ స‌భ‌లో నేడు దాడి జ‌ర‌గ‌డం ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. నిండు స‌భ‌లో జ‌రిగిన దాడి పూర్తిగా భ‌ద్ర‌తా వైఫ‌ల్యంగా భావిస్తున్నామ‌ని, దానికి తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని పేర్కొన్నారు..

దాడి అనంత‌రం తిరిగి ప్రారంభ‌మైన లోక్ స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై స‌భ్యులు ప్ర‌శ్న‌ల వర్షం కురిపించారు.. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిం దేన‌ని ప‌ట్టుబ‌ట్టారు..

దీనిని ఆయ‌న స‌మాధానం చెబుతూ,లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం.

ఈ ఘటనపై పూర్తి స్థాయి లో దర్యాప్తు చేప డుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యా ప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణ నలోకి తీసు కుంటాం,అని స్పీకర్ వెల్లడించారు.

ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు.

దాడి ఎలా జరిగింది

కాగా, లోక్‌సభలో ప్ర‌శ్నోత్త‌ర సమయంలో లోక్‌సభలో ఇద్ద‌రు దుండగులు కలకలం సృష్టించారు…సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒకరకమైన గ్యాస్‌ను వదిలి భయభ్రాంతులకు గురి చేశాడు.

అదే సమయంలో పార్ల మెంట్‌ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. అప్ర మత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగుర్ని అరెస్టు చేశారు. కాగా, ఈ గ్యాస్ కేవ‌లం రంగు వెద‌జ‌ల్లు తుంద‌ని, దీని వ‌ల్ల ఎటు వంటి ప్ర‌మాదం లేద‌ని లోక్ స‌భ భ‌ద్ర‌తా సిబ్బంది ప్ర‌క‌టించారు.

ఆ ఇద్ద‌రు దుండ‌గుల‌ను సాగ‌ర్ శ‌ర్మ‌, మ‌నోరంజ‌న్ డి గా గుర్తించారు. అధికారులు వారి వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. నిందితులు మైసూర్‌-కొడగు ఎంపీ ప్రతాప్‌ సింహ ద్వారా పార్ల‌మెంట్ లోకి ప్ర‌వేశించ‌ డానికి పాస్ లు పొందార‌ని స‌మాచారం.

నిందితుల‌ను శంకర్ లాల్ శర్మ కుమారుడు సాగర్ శర్మ, డి దేవరాజ్ కుమా రుడు డి మనోరంజన్ (35)గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న వారిలో మ‌హిళ నీలంగా , యువ‌కుడు అమోల్ షిండేగా గుర్తించారు.

దుండగుల గురించి పోలీసు వర్గాలు పరిమిత సమా చారాన్ని విడుదల చేశాయి. అయితే, మనోరంజన్ మైసూరుకు చెందినవాడనీ, మైసూర్ వివేక‌నంద యూని వ‌ర్సీటి లో కంప్యూటర్ సైన్సెస్ లో గ్రాడ్యుయేట్ అని స‌మాచారం.

Previous లోక్‌సభలో అలజడి పరుగులు తీసిన ఎంపీలు
Next బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు
ADVERTISEMENT