| Daily భారత్
Logo




ప్రైవేట్ లో చదివించి ఆర్థికంగా నష్టపోవద్దు

News

Posted on 2025-06-09 07:56:57

Share: Share


ప్రైవేట్ లో చదివించి ఆర్థికంగా నష్టపోవద్దు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శంకర్ విజ్ఞప్తి

మీ డబ్బులు మీ వద్దే .. మీ పిల్లల భవిష్యత్తు మాదే లింగారెడ్డిగూడెం ఘనంగా బడిబాట కార్యక్రమం ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఏడుగురు విద్యార్థులు

డైలీ భారత్, రంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్‌ ఉందని, ప్రైవేట్‌ పాఠశాలలు వద్దని ప్రైవేటులో ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దని ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ 

ప్రజలకు పిలుపునిచ్చారు.

ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ బడిబాట కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రభుత్వ పాఠశాలలో చేరారు.  మండల విద్యాశాఖ అధికారి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు.

బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యా యులతో కలిసి పాల్గొన్న ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులచే విద్యాబోధన ఉంటుందని, విశాలమైన తరగతి గదులు ఉంటాయని, ఆడుకోవడానికి మైదానాలు, తెలుగు, ఆంగ్లంలోనూ విద్యాబోధన ఉంటుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామన్నారు. ప్రైవేట్ లో పిల్లలను అప్పులు సప్పులు చేసి చదివించొద్దని ఆర్థికంగా నష్టపోతారని ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ద్వారా మీ డబ్బులు మీ వద్ద ఉంటాయని పిల్లల భవిష్యత్తు మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని అన్నారు.

Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >