Posted on 2023-12-11 10:03:23
డైలీ భారత్, తెలంగాణ: బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం తరువాత మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలపై సమీక్షలు చేయకుండా మాట్లాడడం సరియైనది కాదని అభిప్రాయపడ్డారు. సమీక్ష నిర్వహించి వాస్తవాలు తెలుసుకున్న తరువాతనే మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు.
బీసీ బంధు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అర్హులకు చేరేట్లు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్న ఆయన ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు బంధుపై బీఆర్‌ఎస్ నాయకులు అప్పుడే విమర్శలు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. తాము అధికారం చేపట్టి రెండు రోజులకే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు నిదర్శనం అధికార పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >