| Daily భారత్
Logo




ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News

Posted on 2023-12-11 09:56:47

Share: Share


 ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఇలాంటి క్రమంలో మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతో లేఖ విడుదల కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణలో దశాబ్దకాలం పాటు కొనసాగిన నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికారు అని పేర్కొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై నమ్మకంతో కాదు.. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని రాసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, ఎమర్జెన్సీ విధించి దేశాన్ని అల్లకల్లోలం సృష్టించిన విషయం ప్రజలు మరిచి పోలేదని మరోసారి పాత అంశాలను గుర్తు చేస్తూ లేఖను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా అమలు చేస్తుంది అని ప్రశ్నను పొందుపరిచారు.

ఇప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మహాలక్ష్మి, రైతు బరోసా, గృహ జ్యోతి, యువ వికాసం, చేయూత లాంటి ఆరు గ్యారంటీ లకు నిధులు ఎలా సమకూర్చుతారు అని నిలదీస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు. నిత్యవసరాల ధరలు పెంచి, పన్నులు పెంచితే ప్రజలు సహించరు అని లేఖ ద్వారా హెచ్చరించారు. అలాగే ఆదివాసీల చట్టాలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హరిత హారం వెంటనే రద్దు చేసి ఆదివాసీలపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవీ చట్టం ప్రకారం లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >