| Daily భారత్
Logo




డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల పై అవగాహన

News

Posted on 2025-05-29 15:44:41

Share: Share


డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల పై అవగాహన

డైలీ భారత్, సూర్యాపేట: ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉపాధ్యాయుల వేసవి శిక్షణ తరగతుల్లో షీ టీమ్స్, పోలీస్ కళాబృందం వారు డ్రగ్స్ నిర్మూల, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు, వీటి నివారణలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశాలపై సూర్యాపేట పట్టణ పరిధిలోని హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  భౌతిక శాస్త్ర ఉపాధ్యాయలకు కెపాసిటి బిల్డింగ్  ప్రోగ్రాం నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు,  బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. విద్యాలయాల్లో విద్యార్థుల నదవడికపై దృష్టి పెట్టిన చెడు అలవాటుకు గురైతే సన్మార్గంలో నడపాలి అన్నారు. షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.

అనంతరం పోలీసు  కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు

 ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యతిపతి రావు, జిల్లా రిసోర్స్ పర్సన్స్ వేల్పుల వెంకటేశ్వర్లు, అంకతి వెంకన్న, మధుసూదన్ రెడ్డి, ఖాదర్ పాషా, దండాల మధు, షీ టీం మహిళా కానిస్టేబుల్ ఉమా, కళాబృందం  ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున , గురులింగం,మరియు  టీచర్స్ పాల్గొన్నారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >