| Daily భారత్
Logo




వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి : కె.నరసింహ ఐపిఎస్

News

Posted on 2025-05-29 15:42:49

Share: Share


వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి : కె.నరసింహ ఐపిఎస్

 - పోలీసు తనిఖీలు ప్రజల రక్షణ కోసం. 

- జరిమానాలు శిక్ష కాదు, రోడ్డు భద్రత నియమాలు పాటించడం కోసమే.

.... కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: ప్రజల రక్షణ, భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేస్తున్నాము అని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ప్రకటనలో తెలిపినారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రయాణ సమయంలో వాహనదారులు రహదారి భద్రత జాగ్రత్తలు పాటించాలని ముందస్తు జాగ్రత్తల వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యాన్ని చేరుతారని అన్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించి వాహనాల నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తూ జరిమానా విధిస్తున్నాము, ఈ జరిమానా అనేది మార్పు కోసమే అని ఎస్పీ తెలిపారు. ఒకరి తప్పు, నిర్లక్ష్యం వల్ల మరొకరు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడుతున్నారు, కావున ప్రతిఒక్కరూ రోడ్లపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. గత ఐదు నెలల కాలంలో నిభందనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న 1,25,000 వాహనాలపై జరిమానా విధించాము, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 6500 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 

పోలీసు సూచనలు

- వాహనాలు వేగంగా నడపవద్దు.

- మద్యం మత్తులో వాహనాలు తోలవద్దు.

- ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వాహనాలు నిలుపవద్దు.

- తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు.

- వాహన పరిమితికి మించి రవాణా చేయవద్దు.

- ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

- లైసెన్స్ కలిగి ఉండాలి.

- హెల్మెట్ ధరించాలి.

- పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

- మలుపల వద్ద ఇండిగేటర్ ఉపయోగించాలి.

- వాహనం మంచి కండిషన్ లో ఉండాలి.

- అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లు ఉపయోగించవద్దు.

- ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయవద్దు, ఎక్కువ దూరం ప్రయాణిస్తే మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.

- నిద్రావస్థలో డ్రైవింగ్ చేయవద్దు.

Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >