Posted on 2025-05-26 12:10:16
పక్కా ప్లాన్ తో చోరీ లు చేస్తున్న గుడివాడ కి చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
ముఠా సభ్యుల చోరీల వివరాలు వెల్లడించిన గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్
డైలీ భారత్, కృష్ణా జిల్లా:పగలు కొత్తిమీర కరేపాకు అమ్ముతూ.... రాత్రుళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ మీడియా సమావేశంలోవెల్లడించారు.
పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముఠా సభ్యులను పట్టుకున్నారు.
వారి వద్ద 3 లక్షలు విలువైన 26 గ్రాములు బంగారం.....562 గ్రాముల వెండి ,3500 నగదు ,రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియజేశారు.
ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని,నిందితుల్లో ఒకరు మైనర్ కావడం విశేషమన్నారు.
పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతున్నట్లు ఊర్లలో తిరుగుతూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ తెలియజేశారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >