Posted on 2025-05-25 13:50:41
డైలీ భారత్, న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీతో యుద్ధమే అని ప్రకటించుకున్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఎప్పుడూ ప్రధాని హోదాలో ఉన్న మోదీతో ఎదురుపడేందుకు ఆసక్తి చూపించలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినా సరే స్వాగతం చెప్పడానికి కేసీఆర్ కు మనసు అంగీకరించలేదు. ఇక నీతి ఆయోగ్ లాంటి సమావేశాల్లో అసలు పాల్గొనలేదు. దీంతో మోదీతో కేసీఆర్ బంధం పూర్తిగా తెగిపోయింది. నిజానికి అంతగా దూరం పెంచుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా విబేధించడం వేరు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వేరు. ఈ తేడాను కేసీఆర్ గుర్తించలేకపోయారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో మోదీని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో స్టాలిన్ మొదటి వరుసలో ఉంటారు. కానీ ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. మోదీతో వ్యక్తిగతంగా నవ్వుతూ మాట్లాడారు. ఇలాంటి లౌక్యాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నప్పటికీ.. రాజకీయాలకు సంబంధం లేని అధికారిక వ్యవహారాల్లో ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. దాని వల్ల పార్టీ హైకమాండ్ లో తనపై అనుమానం తలెత్తుతుందని ఆయన సందేహపడటం లేదు. రాజకీయంగా విబేధించాల్సిన చోట గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని కొంత మంది విమర్శలు చేయవచ్చు కానీ..రేవంత్ రాజకీయంగా ఎప్పుడూ బీజేపీ, మోదీని సమర్థించే ప్రయత్నం చేయలేదు. పాలన చేయాల్సింది రేవంత్ కాబట్టి కేంద్రం సహకారం ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మాత్రం లౌక్యం తెలియక కేసీఆర్ ఇబ్బంది పడ్డారు. రేవంత్ చాలా చాకచక్యంగా..లౌక్యంగా రాజకీయం చేస్తున్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >