డైలీ భారత్, చత్తీస్ ఘఢ్ : ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లా చోతేదోంగర్ గ్రామ స్థుడ్ని శనివారంసాయంత్రం నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంఝ అని పోలీస్‌లు గుర్తించారు.
చోతేదోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంఝ ఆయన తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది.
వీరిద్దరికీ గతంలో చంపు తామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. వారిలో వీరిద్దరు ఉన్నారు.
రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు.
మంఝహత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలిం చారు. హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది.
మంఝ,అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా పని చేస్తు న్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్‌లో రాసి ఉంది. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు