| Daily భారత్
Logo




కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2023-12-10 13:38:50

Share: Share


కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్‌లోని సోమా జిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.రేవంత్‌ రెడ్డి కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు.

కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడింది. వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు.

ఆర్థోపెడిక్‌, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్‌ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్‌ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు.

సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్‌ పరిభాషలో మొబిలైజేషన్‌ స్టార్ట్‌’ అంటారని వివరించారు.

కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటు న్నారని పేర్కొన్నారు.

బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజి యోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు,మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

 కెసిఆర్ కు  కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు...

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >