| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామికి భక్తుల తాకిడి

యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామికి భక్తుల తాకిడి

డైలీ భారత్, హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

కార్తీక మాసం చివరి రోజుకావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి సిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించు కోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు నోమాలు వ్రతాలు చేసి భక్తపారవశ్యంలో మునిగి పోయారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో విశేష పూజలు అందు కుంటున్నారు.

అర్చకులు స్వయం భువులగా కొలిచి కవచ మూర్తులకు అష్టోతర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు చేపట్టారు.

మహిళలకు ఉచితం ప్రయాణం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు యాదాద్రికి తరలి వచ్చారు...

Previous మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం
Next సిర్పూర్ కాగజ్ నగర్ రైలుకు అగ్ని ప్రమాదం
ADVERTISEMENT