| Daily భారత్
Logo




మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం

News

Posted on 2023-12-10 10:49:46

Share: Share


మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం

అధికారుల వేధింపులకు మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం

డైలీ భారత్, మంచిర్యాల జిల్లా:మహిళా బీట్‌ ఆఫీసర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.

బాధితురాలి కథనం ప్రకారం..వెంచపల్లి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ శ్రీలత శుక్రవారం కార్యాలయం నుంచి వెంచపల్లిలోని తన క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

రాత్రి సమయంలో నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరు కోగా..గమనిం చిన భర్త రాజేశ్‌ వెంటనే మంచి ర్యాల లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు.

చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ఉన్న తాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు శ్రీలత తెలిపారు.

వెంచపల్లి ఫారెస్ట్‌ బీట్‌ పరిధిలో బీహార్‌ కూలీలతో ప్లాంటేషన్‌ పనులు చేయి స్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

అందుకు డబ్బులు చెల్లిం చాలని బీహార్‌ లేబర్‌ కోరగా ఉన్నతాధికారులు చెల్లిస్తా రని శ్రీలత చెప్పారు.

డబ్బుల జాప్యంపై కూలీల బృందం సభ్యుడు జిల్లా అటవీ సంరక్షణాధికారి దృష్టికి తీసుకెళ్లాడు. కూలీ లకు వెంటనే డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారి ఆదేశించారు.

ఈ విషయమై మాట్లా డేందుకు తన కార్యా లయానికి రావాలని శుక్రవారంశ్రీలతకు కోటపల్లి రేంజర్‌ రవి ఫోన్‌ చేశారు.సాయంత్రమైనా రేంజర్‌ కార్యాలయానికి రాకపోవడంతో ఆమె ఇంటికి బయల్దేరారు.

ఆ సమయంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ద్వారా ఫోన్‌ చేసి, తిరిగి కార్యాలయానికి రావాలని రవి సూచించారు. దీంతో శ్రీలత తిరిగి రేంజ్‌ కార్యాలయానికి వెళ్లారు.

నీ వల్లే నాకు చెడ్డపేరు వచ్చిందని,అందుకే నిన్ను సస్పెండ్‌ చేస్తానని రేంజర్‌ బెదిరించినట్టు శ్రీలత తెలిపారు.మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యా యత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని రేంజర్‌ రవి పేర్కొన్నారు.

తాను ఎవరినీ వేధించలేదని చెప్పారు. విధులకు సంబంధించి సూచనలు చేశానే తప్ప దూషించలేదని స్పష్టం చేశారు.

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >