| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎంవో అధికారినంటూ మోసాలు.. పోలీసులు అదుపులో నిందితుడు

సీఎంవో అధికారినంటూ మోసాలు.. పోలీసులు అదుపులో నిందితుడు

డైలీ భారత్, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్‌ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన అత్తిలి ప్రవీణ్‌ సాయిని పోలీసులు అరెస్టు చేశారు..

పలువురికి సీఎం ప్రొటోకాల్‌ నకిలీ స్టిక్కర్లను ప్రవీణ్‌ అందించినట్లు అభియోగాలున్నాయి. మంత్రుల లెటర్‌ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, భూసమస్యలు పరిష్కరిస్తానంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్‌ సాయి ఎల్బీ నగర్‌ ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడి ఇన్నోవా కారు, సెల్‌ ఫోన్‌ సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

Previous జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
Next మహిళ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యయత్నం
ADVERTISEMENT