| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్చనను అభినందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అర్చనను అభినందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించిన అర్చనను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అభినందించి తన ఆశీస్సులు అందజేశారు.ఎంపీ రవిచంద్ర పీఏగా వరంగల్ లో పనిచేస్తున్న వీణవంక కిరణ్ కుమార్ కూతురు అర్చన హన్మకొండ నయీం నగర్ లోని రీజొనెన్స్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఏంపీసీ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించారు.ఈ సందర్భంగా కిరణ్ తన సతీమణి కావ్యశ్రీ, కూతురు అర్చన, కుమారుడు ప్రనూన్ తో పాటు ఆదివారం ఉదయం ఎంపీ రవిచంద్రను కలిసి తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేశారు.ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో తన కూతురు సాధించిన మార్కుల గురించి  తెల్పగా ఎంపీ రవిచంద్ర అర్చనకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.

Previous ఘనంగా సర్దార్ జలగం వెంగళరావు 103 జయంతి వేడుకలు
Next ఘనంగా టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ జన్మదిన వేడుకలు
ADVERTISEMENT