| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా సర్దార్ జలగం వెంగళరావు 103 జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ జలగం వెంగళరావు 103 జయంతి వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ జలగం యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీ"శే"సర్దార్ జలగం వెంగళరావు 103 వ జయంతి వేడుకలను స్థానిక పూర్ణ టీ స్టాల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జలగం వెంగళరావు చేసిన కృషి ఎంతో గొప్పదని, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం అని అన్నారు. జిల్లాకు సింగరేణి, నవభారత్,స్పాంజ్ ఐరన్,ఐటిసి,హెవీ వాటర్ ప్లాంట్ వంటి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని,ఎన్నో ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి ఊపిరిపోశారని, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆ మహానుభావుని చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించి భవిష్యత్ తరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో TUF జిల్లా అధ్యక్షులు మంజూర్, జమ్ముల సీతారాం రెడ్డి,కేశూలాల్ నాయక్, శ్రీపాద సత్యనారాయణ, బొల్లం భాస్కర్, భాస్కర్ రావు,టైగర్ దుర్గాప్రసాద్ ,సమ్మిరెడ్డి జనార్ధన్ రెడ్డి, కొండపల్లి సీతారామయ్య,అప్పల నాయుడు,కేసరి రవీందర్,మురళీకృష్ణ, బిల్లా సుజిత్,సురేష్ నాయక్, సుధాకర్, పరమేష్ పెద్దిరాజు గణేష్, సమ్మయ్య, చంద్రశేఖర్ రెడ్డి, తాజుద్దీన్, గణేష్ మహేశ్వరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Previous తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Next అర్చనను అభినందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ADVERTISEMENT