| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండలంలో పశువుల రవాణా అరికట్టాలి : జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి

జూలూరుపాడు మండలంలో పశువుల రవాణా అరికట్టాలి : జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి

మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జూలూరుపాడు సి.ఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై  బాదావత్ రవి, ఎమ్మార్వో స్వాతి బిందు జూలూరుపాడు, ఎంపీడీవో, ఎం పి ఓ, వెటర్నరీ డాక్టర్స్ , మరియు మండల ఇతర అధికారులతో సమావేశమై,పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి, గ్రామాల్లో విధులు నిర్వహించే పంచాయతీ సెక్రెటరీలు రైతులు పశువుల అమ్మకాలు,కొనుగోలు చేసేటప్పుడు చేయవలసిన విధుల గురించి తెలియజేసినారు. పశువుల అక్రమ రవాణా వ్యాపారం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పోలీసులు వాహన తనిఖీలు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు వాహనాలలో పశువుల రవాణా చేస్తూ కనబడినచో,వాటి అనుమతుల గురించి, సంబంధిత పత్రాలను పరిశీలించాలని,ఈ సందర్భంగా తెలియజేసినారు. ఎవరికైనా ఇట్టి అక్రమ వ్యాపారం గురించి సమాచారం ఉన్నయెడల తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగాతెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులుపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు
Next బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డులు రద్దు
ADVERTISEMENT