| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు

 ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు

జూలూరుపాడు మండలం బేతాళ పాడు ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాలో చేర్చాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నా ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు

చేసిన జూలూరుపాడు ఎస్సై బాధావత్ రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన బేతాలపాడు పంచాయతీకి చెందిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు అయినా ఘటన జూలూరుపాడు మండలంలో జరిగినది వివరాల్లోకి వెళితే చౌడం వెంకటేశ్వర్లు, బానోతు కళ్యాణ్, బానోతు కవిత, ధారావత నాగమణి, బానోతు బిందు, బానోతు సునీత ,ధారావత్ బాబులు రేగళ్ల తండా నందు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తక్షణమే తమ పేర్లు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో చేర్చాలని, లేని యెడల వాటర్ ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినారని, పంచాయతీ సెక్రటరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కిందికి దిగమని బ్రతిమిలాడినను ట్యాంకు పైనుండి కిందికి దిగకుండా విధులకు ఆటంకం కలిగించారని, సదరు వ్యక్తులపై చర్య కొరకు బేతలపాడు పంచాయతీ సెక్రెటరీ షేక్ ఇస్మాయిల్ ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేయనైనది.

Previous గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం..
Next జూలూరుపాడు మండలంలో పశువుల రవాణా అరికట్టాలి : జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
ADVERTISEMENT