| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం..

గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం..

కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..

డైలీ భారత్, మహబూబాబాద్: తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు.

గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా, వినూత్నంగా అమలు చేయబోతోందని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాదు.. కేసీఆర్ హయాంలో స్కీమ్‌లన్నీ స్కామ్‌లుగా మారాయి. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరిని చట్టం ఎదుటకి తీసుకొస్తాం అంటూ హెచ్చరించారు.

Previous మధ్యావర్థులు అవసరం లేదు.. నన్ను నేరుగా వచ్చి కలవచ్చు.. : ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
Next ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు
ADVERTISEMENT