| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళా దారుణ హత్య?

మహిళా దారుణ హత్య?

పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో మహిళా దారుణ హత్య?

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది,ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రామగిరి మండల పరిధిలోని కల్వచర్ల గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మహిళ తలపై సిమెంట్ ఇటుకలతో కొట్టి హత్య చేశారు.హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. 

ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన రామగిరి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

అనంతరం అక్కడున్న ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అయితే, మహిళను సిమెంట్ ఇటుకతో దుండగులు బలంగా కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. 

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రామగిరి పోలీసులు వెల్లడించారు.

Previous పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా
ADVERTISEMENT