| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల, షాబాద్, శంకర్ పల్లి, మొయినాబాద్ మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పంపిణీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు వరమన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మన సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,సున్నపు వసంతం ,ప్రతాప్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మహేందర్ గౌడ్,శ్రీనివాస్, జంగయ్య,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Previous అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Next మహిళా దారుణ హత్య?
ADVERTISEMENT