| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనీ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షానికి మండలాలలో పలు గ్రామంలో వరి ధాన్యం, మక్కలు, మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 20వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో దాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల దగ్గర ఉన్న ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారని,. రైతులను పట్టించుకునే నాధుడే లేడని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. గాలి వానతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి మండల కేంద్రంలో ఆందోళన చేపడతామని తెలిపారు.

Previous రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి: పీఓకేలో ప్రజలకు అలర్ట్‌..!!
Next పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT