ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
డైలీ భారత్ ,సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో డిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో ప్రధాన కూడల్లల్లో సోనియాగాంధీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి కేటీఆర్ ఇలాకాలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. సోనియాగాంధీ ఫ్లెక్సీల ను ధ్వంసం చేయడం పట్ల నిర్వేదానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు భాద్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని అన్నారు.ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో ఏమోనని ! పట్టణ ప్రజలు చూస్తున్నారు