సమ సమాజ నిర్మాణానికే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్ల శివచంద్ర
జిల్లా కలక్టర్ కు పిర్యాదు
డైలీ భారత్, సిరిసిల్ల ;జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో 85 లక్షల అవినీతి జరిగిందని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్ సంస్థ ఆధ్వర్యంలో సాక్షాదారాలతో శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్ల శివచంద్ర మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో గ్రామ రికార్డును తనిఖీ చేయగా సుమారు 85 లక్షల వరకు అవినీతి జరిగిందని సాక్షాదారులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఒకే గ్రామంలో ఇంత పెద్ద మొత్తం లో అవినీతి జరిగితే జిల్లా వ్యాప్తంగా అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవవచ్చన్నారు. అంతే కాకుండా వల్లంపట్ల అవినీతి విషయంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. మొక్కల పంపిణీ, రోడ్లు, గ్రామపంచాయతీ అవసరాల విషయంలో, భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు శివచంద్ర, రత్నాకర్, సంపత్ కుమార్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.