| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల కు ఘన నివాళి

ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల కు ఘన నివాళి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా దమ్మపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు ఘన నివాళి అర్పించారు

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ ధారా యుగంధర్ మాట్లాడుతూ...

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని అలాంటి మహానీయుడు పేరు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు  తొలగించి రావి నారాయణరెడ్డి పేరు పెట్టడం అనేది దుర్మార్గమైయినా ఆలోచన అని రేవంత్ రెడ్డి అధికారం లో కి రాక ముందు వైశ్య కార్పొరేషన్ అని చేప్పి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వైశ్యలను అవమానిస్తున్నారు అని రాష్టం లో ఉన్నటువంటి మన జనాభా లెక్కల నిష్పాతుల ప్రకారం అయితే 14% ఉన్నటువంటి ఆర్యవైశ్యులను వారి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేల ఉన్నాయి అని వెంటనే పేరు తొలిగించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలి అని అన్నారు. అనంతరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు తొలగించడం అనే అనలోచన నిర్ణయం వలన ఆర్య వైశ్య ల యొక్క మనో భావాలు దెబ్బతీసేల ఉన్నాయి అని ఆంధ్ర రాష్టం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.


ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ధారా ప్రసాద్ వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్ ప్రదీప్,వినోద్,పోసి, సాయిరాం, బచ్చు సత్యనారాయణ అఖిల్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Previous తపాలా శాఖ ద్వారా భద్రాచలం రామయ్య తలంబ్రాలు
Next బానోత్ జవహర్లాల్ కి నివాళులర్పించిన జూలూరుపాడు మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు
ADVERTISEMENT