డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్రస్వామి పోస్టాఫీస్ ద్వారా భద్రాచలం రామయ్య పరోక్ష సేవలు అందించటానికి తపాలా శాఖ సిద్ధమైంది. శ్రీ సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేకంలో స్వయంగా పాల్గొనలేని భక్తులు సమీప పోస్టాఫీస్‌కు వెళ్లి అంతరాలయ అర్చన, తలంబ్రాలకు రూ.450, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చొప్పున చెల్లించి పూర్తి వివరాలతో దరఖాస్తు అందజేయాలని, ఇంటికే చేరవేస్తామని అధికారులు తెలిపారు. నీ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు
News
తపాలా శాఖ ద్వారా భద్రాచలం రామయ్య తలంబ్రాలు