| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కలలు చెదిరినా.. కాలానికి ఎదురీదిన రీటా... బిహార్‌ ఆదర్శ మహిళ

కలలు చెదిరినా.. కాలానికి ఎదురీదిన రీటా... బిహార్‌ ఆదర్శ మహిళ

విద్యార్థులకు కనిపించేలా బెంచీ ఎక్కి పాఠం బోధిస్తున్న రీటా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తండ్రిలా పోలీసు అధికారి కావాలని ఆమె కలలు కన్నారు. 3 అడుగులకే పరిమితమైన మరుగుజ్జు దేహంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. అయితేనేం.. రీటా రాణి (52) ఇప్పుడు ఎంతోమంది అధికారులను సమాజానికి అందిస్తున్న ఓ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు ఎంతో ఇష్టమైన సోషల్‌ సైన్సు టీచరు. బిహార్‌లోని గయ జిల్లా ధన్‌వాన్‌ గ్రామానికి చెందిన రీటా రాణి మరుగుజ్జుతనం చూసి కంగుతిన్న తల్లిదండ్రులు దేశంలోని పెద్ద ఆసుపత్రులతోపాటు విదేశంలోనూ చూపించారు. చిరుప్రాయంలోనే వాస్తవాన్ని అంగీకరించిన ఆమె సహ విద్యార్థుల నుంచి, బంధువుల నుంచి ఎదురైన అవమానాలను సహిస్తూ మరింత దృఢమైన మహిళగా రూపొందారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్, కేంద్ర మంత్రి జీతన్‌రామ్‌ మాంఝీ వంటి ప్రముఖుల చేతుల మీదుగా పలు జాతీయ, రాష్ట్రస్థాయి సత్కారాలు అందుకొన్నారు. వివాహ సంబంధాలు వచ్చినా అవివాహితగా మిగిలిపోయిన రీటా రాణి సమాజానికి మదర్‌ థెరెసాలా సేవ చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు.

Previous మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next సీతరాముల వారికీ గోటి తో కోటి తలంబ్రాలు
ADVERTISEMENT