Posted on 2023-08-30 08:23:43
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు..
ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >