| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దివ్యాంగురాలికి అండగా నిలిచిన కేకే

దివ్యాంగురాలికి అండగా నిలిచిన కేకే

పని చేయలేని స్థితిలో అమ్మానాన్నలు..అన్ని తానై కుటుంబాన్ని పోషిస్తున్న కూతురు

తనకొచ్చే పెన్షన్ పైసలతోనే కుటుంబాన్ని పోషించే దీన పరిస్థితి

ఉపాధి చూపాలని గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేసిన ఫలితం శూన్యం

దివ్యాంగురాలు గొట్టే సుమలతకు అండగా నిలిచిన సిరిసిల్ల కాన్స్టెన్సి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో మాట్లాడి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించిన కేకే

డైలీ భారత్, ముస్తాబాద్:ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టే సుమలత పుట్టుకతోనే దివ్యాంగురాలు. చదువుకోవడానికి తన అంగవైకల్యం అడ్డు రాలేదు.ఉన్నత చదువులు చదివింది కానీ ఉపాది లేకుండా ఉండి పోయుంది.తల్లిదండ్రులు ఇద్దరూ వృద్దులు కావడంతో పనిచేయని స్థితిలో ఉండడంతో తనకొచ్చె పెన్షన్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.ఏదైనా ఉపాధి చూపాలని గత ప్రభుత్వ పెద్దలను ఎన్నోసార్లు కలిసినా పట్టించుకోలేదని సుమలత ఆవేదన వ్యక్తం చేసింది.తనకు ఏదైన ఉపాధి చూపాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిను కలిసి అడిగింది.వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కు విషయం తెలియజేశాడు.వెంటనే స్పందించిన కలెక్టర్.. సిస్టం ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించాడు.తనకు అండగా ఉండి ఉద్యోగ భరోసా కల్పించిన కేకే మహేందర్ కి కృతజ్ఞతలు తెలిపారు సుమలత వారి కుటుంబ సభ్యులు.

Previous వంకాయలపాటి వెంకట్ తల్లి దశదినకర్మలలో నివాళులు అర్పించిన టి జే యం యు
Next విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పేరును అష్టలక్ష్మీ దేవాలయం స్టేషన్ గా పేరు మార్చాలి
ADVERTISEMENT