దమ్మపేట మండలం రామచంద్రపురం కొందరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం పై స్పందించిన ఆదివాసి నాయకులు తంబల్ల రవి
డైలీ భారత్, అశ్వరావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ లో గ్రూపు రాజకీయాలు ఎన్ని ఉన్నా ....మా ఆదివాసి ఎమ్మెల్యే జారే.ఆదినారాయణ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా...?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ...దమ్మపేట మండలం ఒక గ్రామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగినది,ఏజెన్సీ ప్రాంతం ఆదివాసి ఎమ్మెల్యే అయినటువంటి జారే ఆదినారాయణ ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించక పోవడము ఆదివాసీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పై చిన్న చూపా?..ఆదివాసీ ప్రజా ప్రతినిధులు అంటే లెక్కలేనితనమా?ఎమ్మెల్యే ఫోటో ని కావాలనే తొలగించారు...ఇది ఎమ్మెల్యే కి మాత్రమే కాదు అశ్వారావుపేట నియోజకవర్గo ఆదివాసీలకు జరిగిన అవమానంగా భావిస్తున్నాం అని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి అన్నారు,కనీసం అవగాహన లేకుండా ఇతర నాయకులు ఫోటోలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎన్ని ఉన్నా సరే ఏజెన్సీ ప్రాంతంలో మా ఆదివాసి ఎమ్మెల్యే కనీసం గుర్తించకుండా మీరు అలా చిత్రీకరించడం మా ఆదివాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లే అని అన్నారు,ఇలాంటివి భవిష్యత్తు లో యిటువంటి సంఘటనలు పునరావృతం కాకుండ చూడాలి అని ఆదివాసి నాయకులు తంబల్ల రవి హెచ్చరించారు.