10,000/- రూపాయలు స్వాదీనం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సుజాత్ నగర్ పోలీసులు రైడ్ చేయగా ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి Rs.10,000 /- రూపాయలు, మరియు పేకలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పేకాట ఆడిన వారి వివరాలు
1 భూక్య నగేష్
2 బుడ సాయి
3 కున్సోత్ రామ్ కుమార్
4 భూక్య మంగు
5 బానోత్ శ్రీను
6 మాలోత్ కృష్ణ
7 భూక్య మనోజ్ కుమార్
పరారీలో ఉన్న వారి వివరాలు
8 లావుడియా శోభన్
9 కున్సోత్ నగేష్
10 వాంకుడోత్ తులసీరామ్
పై వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సుజాతనగర్ మండలం ప్రజలకు తెలియజేయునది గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే 8712682037 కు సమాచారం అందించాలని తెలియచేస్తున్నాం. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ రైడ్ లో సుజాతనగర్ ఎస్సై మరియు సిబ్బంది ASI వెంకటేశ్వర్లు, HC వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, కొండం రాజు, PC B. రమేష్,D. రమేష్, బాలకృష్ణ, HG సీతారాములు పాల్గొన్నారు.