| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేటీఆర్ నోట ఓటమి మాట

కేటీఆర్ నోట ఓటమి మాట

గతంలో కలవంది నిజమే

ఇకపై వారానికి రెండు రోజులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల ;  సిరిసిల్ల నియోజకవర్గంలో ఈసారి కేటీఆర్ గెలవడం కష్టమేనని కొంతమంది రాతలు రాస్తున్నారని, దీన్ని నిజమని సొంత పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారని, మనలో మనమే కోరుక్కోని ప్రమోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటున్నామని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం కన్ఫ్యూజ్ అయ్యి తోటి కార్యకర్తలను ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దన్నారు. కాంగ్రెస్ మాటలు విని హైరానా పడవద్దని, మనలో మనం మాట్లాడుకుంటున్నదే ఓడిపోతున్నామని వార్తలు వస్తున్నాయని హెచ్చరించారు. ప్రజలను అనుకూలంగా మార్చుకోకపోతే నష్టపోయేది మనమేనని నిన్న సిరిసిల్ల పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ను ఆయన 6:30 నిమిషాలు మాట్లాడిన ఆడియో బయటకు లీకై వైరల్ గా మారింది.

ఇక అందుబాటులో ఉంటా...

ప్రజలకు ఎన్ని పనులు చేసినా ఎంత మంచి చేసిన ఎక్కడో అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య కనెక్షన్ డైరెక్ట్గా తెగిపోయిందని ,అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని కేటీఆర్ వాక్యానించారు. సొంత పార్టీ కేడర్ లోనే చాలామంది తనతో కలవడం లేదని ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరుకుంటున్నారని కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా వాళ్లని కలవని మాట నిజమేనని వివరించారు. ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా వారానికి రెండు రోజులపాటు సిరిసిల్లలోనే ఉంటానని ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అందుబాటులో ఉంటానని పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.

Previous పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్
Next కార్మిక హక్కులు కాల రాసిన పార్టీలను అభ్యర్థులను ఓటుతో తగిన గుణపాఠం చెప్పండి
ADVERTISEMENT