కార్మికులకు కార్మిక సంఘ నాయకులకు ఆడారి విజ్ఞప్తి
కార్మిక హక్కుల ఉద్యమ నేత ఆడారి నాగరాజు
డైలీ భారత్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ కి మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున కార్మిక హక్కుల కోసం దశబ్ద కాలం పోరాటం చేసిన కార్మిక హక్కుల ఉద్యమ నేత ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు కార్మిక హక్కులు కాలరాసిన రాజకీయ పార్టీలను అభ్యర్థులను ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణలో ఉన్న కార్మికులకు కార్మిక సంఘ నాయకులకు ట్రేడ్ యూనియన్ లీడర్స్ కు ఆడారి నాగరాజు ప్రత్యేకించి విజ్ఞప్తి తెలియజేశారు ఎన్నికల సమయంలో కార్మికులందరూ ఐక్యమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు కార్మిక హక్కుల కోసం రాజకీయ పార్టీలు చుట్టూ రాజకీయ నాయకులు చుట్టూ తిరిగే కాలం పోయిందని కార్మికులు దేశాన్ని పాలించడానికి దేశ రాజకీయాన్ని శాసించడానికి సిద్ధంగా ఉన్నామని ఆడారి నాగరాజు స్పష్టం చేశారు .